కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి మాట్లాడుతూ తూర్పు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ డీ గా గుర్తించినా ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో ఓబీసీ సర్టిఫికెట్లు నిలుపుదల చేయడం వలన కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోస్టల్ రైల్వే ఎయిర్ ఫోర్స్ వంటి సంస్థల్లో తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలలో తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తుండగా ఉభయగోదావరి జిల్లాల్లో యువ్వక పోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాల్వంచ యశస్విని దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ జట్టు యూనియన్ నాయకులు తాండ్రోతు సత్తిబాబు, గెద్ద రాము, కంచు బోయిన నాగేశ్వరరావు, గొల్లపల్లి బాబురావు, కంది సత్తిబాబు, నోమ్సు రాజు, గెద్ద వెంకన్న ఉన్నారు.

  • Related Posts

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    కొండాపురం,మన న్యూస్, డిసెంబర్ 17,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమాన పాత్రుడు బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంటు టిడిపి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మాజీ…

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు). రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని రావులకొల్లు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు తెలియజేసారు.ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి