ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి మాట్లాడుతూ తూర్పు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ డీ గా గుర్తించినా ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో ఓబీసీ సర్టిఫికెట్లు నిలుపుదల చేయడం వలన కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోస్టల్ రైల్వే ఎయిర్ ఫోర్స్ వంటి సంస్థల్లో తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలలో తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తుండగా ఉభయగోదావరి జిల్లాల్లో యువ్వక పోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాల్వంచ యశస్విని దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ జట్టు యూనియన్ నాయకులు తాండ్రోతు సత్తిబాబు, గెద్ద రాము, కంచు బోయిన నాగేశ్వరరావు, గొల్లపల్లి బాబురావు, కంది సత్తిబాబు, నోమ్సు రాజు, గెద్ద వెంకన్న ఉన్నారు.