

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులను ప్రశంసించిన రాష్ట్ర డీజిపి డా. జితేందర్ ఐపిఎస్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన సీఐ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుధీర్ లకు ఈ రోజు రాష్ట్ర డీజిపి డా.జితేందర్ ఐపిఎస్ తమ కార్యాలయంలో రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డిజిపి చేతుల మీదుగా అరువార్డులను అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.2023 సంవత్సరంలో ప్రభుత్వం నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కృషి చేసిన అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్ , కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుదీర్ లు శనివారం డీజీపీ కార్యాలయంలో రివార్డులను అందుకున్నారు. సిఆర్. నెం.169/2023, భద్రాచలం పిఎస్ లో 480 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా సి ఆర్ . నెం.198/2023, భద్రాచలం పిఎస్ 484 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా పడేవిధంగా కోర్టు వారికి సాక్షాధారాలను సమర్పించి సమర్థవంతంగా పనిచేసినందుకు గాను వీరి ప్రతిభను గుర్తించి ఇట్టి రివార్డులను అందజేయడం జరిగింది. వీరి ముగ్గురితో పాటు నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయకుమార్ ని కూడా జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

