ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు:- ఇళ్ల స్థలాలు లేనివారు ఎవరూ ఉండకూడదు- ఎంపీ వేమిరెడ్డి సహకారంతో 76 లక్షలతో పాటూరులో చేనేత క్లస్టర్‌- సోలార్‌ విద్యుత్‌ పై అవగాహన కల్పించండి- ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యేకూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం కోవూరు మండలం గుమళ్లదిబ్బ గ్రామంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో మొక్కలు నాటారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి వారికి అవసరం అయిన పనులు చేయించుకోవాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో 76 లక్షల వ్యయంతో పాటూరు చేనేత క్లస్టర్‌ వచ్చిందని వివరించారు. రాబోయే రోజుల్లో ఎస్టీ ప్రజలకు మరింత మేలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో ఎస్టీ ప్రజలు ఎవరైనా ఉండి వారికి పక్కా ఇళ్లు లేకపోయినా, స్థలాలు లేనివారికి తప్పకుండా ఇంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే అవినీతికి తావు లేని అభివృద్ధే తమ నినాదమని, సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. గుమళ్లదిబ్బ గ్రామంలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చాయని, సమస్యలను వీలైనంత త్వరగా దశలవారీగా పరిష్కరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోవురు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు