మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 50 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు, జూనియర్స్ విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. శ్రీ నేరెళ్ళమ్మ వారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ ఈ పోటీలను ప్రారంభించారు. సీనియర్‌ విభాగంలో ప్రథమస్థానం కోర వీర వెంకట సత్యవేణి.(12000 గుమ్మీ లేరు),
ద్వితీయ స్థానంలో మధ్ల నవనీత శ్రీ మణికంఠ (10000 కొవ్వాడ),తృతీయ స్థానంలో కొంచం మనోజ్ (8000 కాపవరం) జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డం అప్పారావు (10000 చేయివాడ), ద్వితీయ స్థానం బడా మాను శ్రీను (8000ధూళ్ళ), తృతీయ స్థానం బండారు శ్రీను (6000కొప్పవరం) ఎడ్లు నిలిచాయి. ఈ కార్యక్రమాని లో వరుపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి బోరయ్య,సూతి ప్రభాకర్ (బాబులు), చంద్రవోలు రాజా, పసల సూరిబాబు,చందువోలు సాయి రాజ్ ,కోరుకొండ శ్రీరామకృష్ణ, తోట నాగేంద్ర,గోపి సాయి తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *