• జనసేన క్రియాశీలక కార్యకర్తల భీమా చెక్కులను పంపిణి చేసిన కొణిదల నాగబాబు

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : జనసేన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం కలిగి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన జన సైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉండి ఆర్థిక భరోసాన్ని కల్పిస్తుంది. మంగళగిరి ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు మరియు ప్రభుత్వ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ జనసేన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం కలిగిన బాధిత కుటుంబాలకు బీమా చెక్ లను అందజేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామానికి చెందిన బెజవాడ భాస్కర్రావు కుటుంబానికి మరియు పెదమల్లాపురం గ్రామానికి చెందిన బోనం సుబ్రహ్మణ్యం కుటుంబాలకు చెరో 5 లక్షల రూపాయల చెక్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయ కర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎల్లప్పుడు జనసైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని క్రియ శిలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు ను అభినందించారు.ఈ కార్యక్రమం లో శంఖవరం మండల అధ్యక్షులు గాబు సుభాష్, మండల ఉప అధ్యక్షుడు తలపంటి బుజ్జి, రెడ్డిపల్లి మధు, కోలా నాగబాబు, గల్లా నానీ, కోరుప్రోలు రమేష్, జర్త సరస్వతి, మాడెం లక్ష్మణ్, జర్త శ్రీను, గూడెం పండు, లోవరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *