

మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పిట్లం పరిధిలో ఉన్న మహమ్మద్ నగర్ మండలంలో ని 50 వేలు ఎంటీఎస్ నాబార్డ్ గోధం,వ్యవసాయ మార్కెటింగ్ శిక్షణ కేంద్రం నిర్మించుటకు 15 ఎకరాల ప్రభుత్వ స్థలంను కేటాయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ను కలిసి పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ , నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మహమ్మద్ నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 ఎకరాలు స్థలంలో కేటాయిస్తే రైతులకు శిక్షణ కేంద్రానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.