భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించటమే లక్ష్యం….. వి ఆర్ హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న సరస్వతీ నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడ రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్ట్ లా డిజైన్ ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ….. నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న విఆర్సీలో చదివిన చాలా మంది ఉన్నతస్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. ఎందరో ప్రజాసేవకులను ఈ కళాశాల సమాజానికి అందించిందన్నారు. 2014 లో తాను.. తన సిబ్బందితో కలిసి 300 మందికి ఐఐటీ కోచింగ్ ఇక్కడే ఇప్పించానని గుర్తు చేసుకున్నారు. అయితే అలాంటి వీఆర్ సి స్కూల్ ను అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వం మూసేసిందని విచారం వ్యక్తం చేశారు. గతపాలకులకి పరిపాలనలో పక్వత లేదని ఎద్దేవా చేశారు. అసమర్ధ పాలనతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అధోగతి పాలు చేసారని మంత్రి నారాయణ మండిపడ్డారు. పది లక్షల కోట్ల అప్పును ప్రజలనెత్తిన గత ప్రభుత్వం వేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సుపరిపాలన వైపు ముందుకు దూసుకెళ్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 20 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించాలని యువనేత లోకేష్ సంకల్పించారని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పిలుపునిచ్చారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఎంఎస్ఈ మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని వెల్లడించారు. అదేవిధంగా వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభానికి మంత్రి లోకేష్ అనుమతి ఇచ్చారని తెలియజేశారు. భారతదేశంలోనే నంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి నారాయణ ఘంటాపధంగా చెప్పారు. వెయ్యి మంది నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 760 మంది పేద విద్యార్థులను గుర్తించామన్నారు. విఆర్సీలో చదివే విద్యార్థుల్లో కొన్ని కుటుంబాలను నా కుమార్తెలు, అల్లుళ్ళు దత్తత తీసుకొంటున్నారని వెల్లడించారు. P4 కింద మరికొందరిని దత్తతకు ఆహ్వానిస్తామన్నారు. Dsr కంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి గుంటబడిని దత్తత తీసుకోవడం సంతోషదాయకమన్నారు. వీఆర్సీ కి ధీటుగా గుంటబడిని తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు. నెల్లూరు సిటీ లో ఉన్న 54 ప్రభుత్వ పాఠశాలాలను కూడా మోడల్ స్కూల్స్ గా తయారు చేస్తామని తెలియజేశారు. తద్వారా రానున్న కాలంలో విద్యాప్రమాణాలు మరింత మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు.అనంతరం నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశం లో ఎక్కడా లేని విదంగా వీఆర్ స్కూల్ ను మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి చేస్తున్నారన్నారు. కడు నిరుపేద విద్యార్ధుల కోసం మంత్రి నారాయణ చేస్తున్న కృషి అనిర్వచనీయం కొనియాడారు. మూడు పూటలా ఆహారంతో పాటు వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ ఆలోచనతో వేల మంది పేద విద్యార్ధుల తల రాతలు మారబోతున్నాయని చెప్పారు. వీఆర్ స్కూల్ లో ఎంతో మంది చదువుకున్న చరిత్ర ఉందన్నారు. మంత్రి కుమార్తె షరణి కి స్కూల్ పూర్తి బాధ్యతలను అప్పగించడం అభివృద్ధిని స్వాగతించడమేనని రూప్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు కమిషనర్ నందన్ ..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్.. 44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు..45 వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి.. బూత్ కన్వీనర్ కార్తిక్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    సీతారామపురం :(మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి నాగరాజు ://// కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం…

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు :///// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//