మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జుక్కల్ నియోజకవర్గానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.1957 లో జుక్కల్ నియోజకవర్గం జనరల్ గా ఉండేది,జుక్కల్ నియోజకవర్గాన్ని 1978లో ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీగా ఏర్పాటు చేశారు.ఇప్పటికి 47 సంవత్సరాలైనా నియోజకవర్గానికి గెలుపొందిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జుక్కల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంతారావు గెలుపు పొందడం జరిగింది,మంచి విద్యావంతుడై ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విద్యావంతుడైన తోటకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని జుక్కల్ నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నారు.తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు జుక్కల్ నియోజకవర్గంను ఇంకా అభివృద్ధి చేయాలని దిశలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పనిచేస్తున్నారని ఆయనకు జుక్కల్ ప్రజలందరూ తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జుక్కల్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *