నగర పంచాయతీ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్న భవన నిర్మాణ కార్మికులు

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) స్థానిక ఎన్నికలకు ముందు కొంతమంది వైసిపి నాయకులు శ్రీ విగ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామంటూ కప్పల చెరువు సమీపంలో జగనన్న కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించి త్వరలో నిర్మాణానికి తోడ్పడుతామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం ఏమిటంటూ సంఘ నాయకులు ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల వనభోజనాల కార్యక్రమం నిర్వహించి కార్మికులకే కాకుండా గ్రామంలోని ప్రజలకు, పార్టీలకతీతంగా నాయకులకు, పలు సంఘాలకు పిలుపునిచ్చి వన సమారాధన కార్యక్రమం నిర్వహించిన మరుసటిరోజే మాపై వైసిపి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అప్పటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, తదుపరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన వరుపుల సుబ్బారావుల నేతృత్వంలో జరిగిన సభలలో పలుమార్లు జగనన్న కాలనీలో మిగులు భూమిని కమ్యూనిటీ హాల్ కి ఇస్తామంటూ అదే ప్రాంగణంలో మరో సభ పెట్టి కమ్యూనిటీ హాల్ కు స్థలాన్ని కేటాయించినట్లు తెలిపిన కొంతమంది వైసిపి నాయకులు మా సంఘంపై పలువురు అధికారులకు ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమన్నారు. అలాగే ఆ స్థలంలో భవనాలను కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన నాయకులు అక్కడ ఎటువంటి కట్టడాలకు సిద్ధమయ్యామో రుజువు చేయాలన్నారు. లేదంటే 15వందల మంది కార్మికుల కుటుంబాలతో సహా ఆరోపణల చేసిన వైసీపీ నాయకుల తీరును ఎండగడుతూ ప్రజా బహుళయంలో నిజ నిర్ధారణకు సిద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మిక తాపీ పనివార్ల సంఘం అధ్యక్షుడు నందకూరి నాగ శంకర్, కార్యదర్శి పలికల శ్రీను, గౌరవ అధ్యక్షులు కర్రోతు మన్నియ్య, ఎల్లం శెట్టి రాము, బ్రహ్మాడ కొండ బాబు, పతివాడ సత్యనారాయణ, సహాయ అధ్యక్షుడు దనేడి చిన్న, గెద్ద శ్రీను, శిడగం శ్రీను,గెద్ద అప్పన్న, కిలాడి శ్రీను, కాకాడ రాజు,సామన వీరబాబు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *