

రాష్ట్ర శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు
Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తల్లిదండ్రులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర శాప్ చైర్మన్ ఆనిమిని రవి నాయుడు తీవ్రంగా ఖండించారు.గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవి నాయుడు తో పాటు పలువురు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ జగన్ రెడ్డి నీ తప్పులు తెలుసుకొని మాట్లాడు, తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంతో రాజకీయ పార్టీ బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చావు అని ఆరోపించారు.జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలతో అధికారం చేతికించుకున్న నీకు ప్రజలే నీటి వల్ల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.అయినా మాజీ ముఖ్యమంత్రి బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదని. ఆయనలో ఉన్న రాక్షస కులానికి నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని దూషణలు దుర్భాషలు దుర్మార్గలే నిన్న జగన్ రెడ్డి నైజం అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి తల్లిదండ్రుల బాగోగులను ఏ విధంగా చూసుకున్నారో మీకు తెలుసా.. నువ్వు ఏమైనా నారావారిపల్లి వచ్చేవా చూసావా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్ రెడ్డి సొంత చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన దుర్మార్గుడు నువ్వు అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి తల్లిని చెల్లిని దగ్గరకు చేర్చుకొని మాట్లాడు వారిని రోడ్డున పడేయకుండా చూసుకో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజల పక్షాన నిలబడు కానీ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం తగదని జగన్ రెడ్డికి రవి నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే బట్టలు విడదీసి రోడ్లమీద పరిగెత్తిస్తామని హెచ్చరించారు. నువ్వు అబద్దాలు ప్రచారం చేస్తే మేము వాస్తవాలను బయటపెడతామని జగన్ నీ ప్రభుత్వంలో ల్యాండ్రేటర్ను దుర్వినియోగం చేసావు చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా శిక్ష అర్హులేనని రవి నాయుడు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్ పి శ్రీనివాసులు తెలుగు తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ వివేక్,వాసుతెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.