కడపలో జరుగునున్న మహానాడుకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు , ప్రజలకు స్వాగతం_ సుస్వాగతం…. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మన న్యూస్, నెల్లూరు:*మే 27, 28 న నెల్లూరుజిల్లా నుంచి 1935 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. *బహిరంగ సభలో జిల్లా నుంచి 45 వేల మంది పాల్గొంటారు.*మహానాడు కేవలం పార్టీ నాయకులకే కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన దినం.*మహానాడులో పాల్గొనే వారి కోసం రవాణాతో పాటు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాయి.నెల్లూరు నగరంలో సోమవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 న జరిగే రాష్ట్ర మహానాడు కి నెల్లూరు పార్లమెంటు ప్రజలకు స్వాగతం సుస్వాగతం తెలిపారు. మహానాడు కేవలం టిడిపి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ముఖ్యమైన రోజని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు మహానాడులో తీసుకుంటారని పేర్కొన్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశం, పలు తీర్మానాలు ప్రవేశపెడతారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి 1935 మంది ప్రతినిధులు మొదటి రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మే 29 వ తేదీ నాడు జరిగే బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంట్ నుంచి 45 వేల మంది పాల్గొంటారని తెలిపారు. టిడిపి నాయకుల కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం రవాణా తో పాటు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉన్నారని అన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి