మన న్యూస్ , నెల్లూరుజిల్లా:ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి.పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించిన సిపిఎం.రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదు అని సిపిఎం నాయకులు అన్నారు.పెహల్గాం దాడులకు పాల్పడిన తీవ్రవాదులను నేటికీ పట్టుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యం చెందింది అని అన్నారు.యుద్ధం వల్ల సాధించిన ఫలితాలను దేశ ప్రజలకు వివరించాలి. పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అని అన్నారు.భారత దేశ విధానాలను ట్రంప్ నిర్ణయించడం విచారకరం. రాజకీయాలకతీతంగా దేశసార్వభౌమాత్వాన్ని, ప్రతిష్టను నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలి సిపిఎం నాయకులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *