కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహన అధికారి పర్వత సురేష్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా 47వ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మహిళల సమూహంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే సత్య ప్రభ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్వత సురేష్ మాట్లాడుతూ, ఆడది అంటే అపలా కాదు సబల అని నిరూపిస్తూ, నియోజకవర్గంలో ఓపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారని,నియోజకవర్గ అభివృద్ధికి తోడపడుతున్న ఎమ్మెల్యే సత్య ప్రభ కి ఆ సత్య దేవుని ఆశీస్సులతోపాటు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో మహిళలు పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *