

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 25 :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19 మరియు 38వ డివిజన్ ల పరిధిలోని అరవింద నగర్ ఎక్స్టెన్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద డ్రైనేజ్ సమస్యను ఆదివారం పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర కమిషనర్ వై.ఓ.నందన్ మరియు నగర మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ.అరవింద నగర్ ఎక్స్టెన్షన్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు మరియు ఆటో ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది,ఈ అండర్ బ్రిడ్జ్ ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఉన్న అవకాశాలను చూసేందుకు పరిశీలించాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు మరియు రైల్వే అధికారులు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఇందులో భాగంగా డ్రైనేజ్ సమస్యను అతి త్వరలో పరిష్కరించి ప్రజలకు ఈ అండర్ బ్రిడ్జ్ మరింత ఉపయోగపడే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నేను కృషి చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో 18,19,20 డివిజన్ ల టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణుప్రియ,19వ డివిజన్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్, 38వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డి, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

