

మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాహనదారుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులకు రవాణా శాఖ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని , పరిమితిని మించి తమ వాహన వేగాన్ని పెంచవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని పరిమిత వేగంతో తమ ప్రయాణాన్ని కొనసాగించడం మూలాన ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తద్వారా తమ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడప రాదని మైనర్ల చేత డ్రైవింగ్ చేయించరాదని, వాహనదారులు తమ వాహనం యొక్క అన్ని ధ్రువపత్రాలను కలిగి ఉండాలని ,సీట్ బెల్ట్ ప్రయాణం సురక్షితమని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీలలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.