

మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధి లోని ఏస్ఎంఆర్ హై ల్యాండ్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను బుధవారం తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన కమిటీ సభ్యులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ వారికీ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి కార్పొరేటర్ సూచించారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ హై ల్యాండ్ ,అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మల్లారెడ్డి, గౌరవ ఉపాధ్యక్షులు సదానంద, అధ్యక్షులు నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు జై తీర్థ, నవీన్, జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రావు, అసోసియేషన్ సభ్యులు పిచ్చయ్య, హరి కిషోర్, శోభ, సుగుణ, బాలరాజ్, రాజేష్ పాండే,వాణి, కళ్యాణ్, వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు.