
మన న్యూస్ ,నెల్లూరు, మే 20 :ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి, అణగారిన వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మంగళవారం వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలియజేశారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. తెలుగు ప్రజల గర్వకారణమైన ప్రకాశం పంతులు సేవలను చిరస్మరణీయంగా నిలిపే దిశగా మనమందరం కలిసి సాగాలి అని కోరుకుంటున్నాను అనే ఆనం అన్నారు. మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా మరోసారి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను అని ఆనం రామనారాయణ రెడ్డిదేవాదాయ శాఖ మంత్రి అన్నారు.
