

మన న్యూస్ ,గూడూరు ,మే 19 :తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనమునందు వాకాటి రామమోహన్ దాతృత్వంలో ప్రతినెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆదివారం ప్రోగ్రాం కి దాతగా సీనియర్ సభ్యులు వాకాటి రామ్మోహన్ దాతృత్వం వహించడం జరిగింది. జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… జనవిజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగిస్తూ మంచి సమాజం కొరకు పాటుపడుతూ చెడు అలవాటులకు దూరంగా ఉండమని ప్రచారం చేస్తూ వాటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని వాటిలో భాగంగానే ప్రతినెల తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు భోజనాలు మరియు ప్రతినెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం మా జే.వి.వి.కి ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని ఇదేవిధంగా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు పోతూ మంచి సమాజం కొరకు పాటు పడతామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, రామ మోహన్, పురుషోత్తమరావు, అరుణ్ కుమార్, టీచర్ రాదయ్య, శర్మ, అశోక్, సుమన్ రెడ్డి, నక్క గోపి, సారంగం బాలు తదితరులు పాల్గొన్నారు.
