

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి,ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మొహమ్మద్ ఖలేద్ లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించడం జరుగుతుందని సూచించారు.రైతుల దగ్గర తరుగు పేరిట దోపిడీకి పాల్పడితే మాకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వారి వెంట గున్కుల్ సొసైటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
