

- పాలీసెట్ లో రాష్ట్ర ప్రధమ ర్యాంకు సాధించిన శశి వెంకట ను సన్మానించిన ఎమ్మెల్యే సత్య ప్రభ
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బద్ది లోవరాజు కుమారుడు శశి వెంకట్ ఇటీవల జరిగిన పదో తరగతి సీబీఎస్సీ పరీక్షల్లో 484/500 మార్కులు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించినందుకు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా శశి వెంకట్ ను కొంతంగి గ్రామం లో గల విద్యార్థి ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ ప్రతిభను కనబరిచిన శశి వెంకట్ ను శాలువ తో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో ర్యాంకుల సాధించడం అద్భుతమైన విషయమని, ఇదే స్పూర్తితో ఉన్నత స్థాయి విద్యాభ్యాసం కొనసాగించాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని , భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని, విద్యతోనే భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి పర్వత సురేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ), ప్రత్తిపాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు బద్ది రామారావు, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్, భారీ స్థాయిలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.