మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో యర్రవరం గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజుకు స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరి సూచనలతో కాకినాడ జిల్లా కార్యాచరణ కార్యదర్శిగా బీశెట్టి అప్పలరాజును నియమించారు.ఈ సందర్భంగా బీశెట్టి అప్పలరాజుకు పలువురు నేతలు,అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి,నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరికి అప్పలరాజు కృతజ్ఞతలు తెలిపారు.నాయకుల సూచనలతో పార్టీ అభివృద్ధికి పని చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *