

Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి ఇంద్రగాంధీ అని ఉపన్యాస ప్రసంగీకులు ఆలమూరి సుబ్బారావు కొనియాడారు. మంగళవారం ఇందిరా గాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని. ఏలేశ్వరం మండలం గ్రామంలో హనుమాన్ సెంట్రల్ లో ఇంద్ర గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు. ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1969 లో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రత ను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. గరీబ్ హఠావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారు. దేశ రక్షణ కోసం అణు భద్రతను తీసుకువచ్చిన ఆమె ధీర వనిత అన్నారు. దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని కొనియాడారు అనంతరం పిల్లలకి బిస్కెట్లు బిల్లలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వూర అప్పన బాబు, శ్రీదేవి, వల్లం రెడ్డి కొండయ్య, వరుపుల రమేష్, వాగు బాబులు, ఉడతల రమణారావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గన్నారు.