
మన న్యూస్, నెల్లూరు, మే 13 : నెల్లూరు సంతపేటలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం మంత్ర క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మాట్లాడుతూ………ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పోయిన వారం దేవాదాయ శాఖ పై సమీక్ష నిర్వహించడం జరిగింది . ఈ సమీక్ష సమావేశం లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది.దేవాదాయ శాఖ పవిత్రమైన గుర్తింపు తేవలసిందిగా ముఖ్యమంత్రి కోరారు అని అన్నారు. ప్రతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఆగమపండితుల ఆధ్వర్యంలోనే జరగాలని ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు అని తెలిపారు. దేవాలయాలలో ఏ కార్యక్రమం జరగాలన్న ఆగమపండితుల ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతుంది అని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు రకాల దేవాలయాలు ఉన్నాయి అని అన్నారు.ఆలయాలకు వచ్చేటువంటి వార్షిక ఆదాయమును బట్టి ఆలయాలు విడివిడిగా విభజించడం జరిగింది అని తెలిపారు. సిక్స్ ఏ క్యాటగిరీలో ఉన్న 169 ఆలయాలలో, ఆలయాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి, కొంచెం ఆదాయం వనరులు అధికంగా ఉన్నటువంటి 22 ఆలయాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు ఈ ఆలయాలలో సీసీ కెమెరాల పరిరక్షణ ఖచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నారు.ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత భావన ఉట్టిపడేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నారు.ఆలయాల పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలని, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నారు. ఆలయాల్లో అన్న ప్రసాదం పూర్తిస్థాయిలో జరగాలని, దానికి రోజువారీగా మెను తయారు చేయాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు వండాలని, భక్తులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నారు.రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఏడు ఆలయాలలో అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది అని అన్నారు. అన్న ప్రసాదం వితరణ కోసం ఎంత ఖర్చవుతుంది అనే వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏడు దేవాలయాలలో పాటు మిగతా 16 దేవాలయాలలో కూడా అన్న ప్రసాదం పెట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే తెలిపారు అని అన్నారు. ప్రముఖ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం మరింత అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేయాలని, ఈ ప్రముఖ శైవ క్షేత్రం వచ్చేటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే శ్రీశైలం దేవస్థాన అభివృద్ధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు అని అన్నారు. శ్రీశైలం లో ఉన్న అటవీ శాఖకు దేవాదాయ శాఖకు మధ్య భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న శైవక్షేత్రాలతో పాటు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలు కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు అని అన్నారు.
