
మన న్యూస్, నెల్లూరు /విజయవాడ, మే 13: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మంగళవారం విజయవాడ లోని సోమిరెడ్డి నివాసం లో కోట, వాకాడు కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయుకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోతమ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి లుమర్యాదపూర్వకంగా కలిసీ పుష్ప గుచ్చం అందజేశారు. ఇటీవల నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవీకి మరియు వైసీపీ ప్రాధమిక సభ్యత్వం కు రాజీనామా చేసి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ నేత్రుత్వం లో మంత్రి లోకేష్ బాబు సమక్షంలో టిడిపి లోచేరారు.ఈసందర్బంగా మంగళవారం నెల్లూరు లోని వేమిరెడ్డి స్వగృహం లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని కలిసిన వినోద్ కుమార్ రెడ్డి అనంతరం నెల్లూరు నుండి విజయవాడ కు చెరుకొని సోమిరెడ్డి ని ఆయన స్వగృహం లో కలిశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డీకి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. వినోద్ కుమార్ రెడ్డి కూడ సోమిరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమం లో వినోద్ కుమార్ రెడ్డి తో పాటు మద్దాలి సర్వో తమ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి లు కూడ సోమిరెడ్డి కి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు.
