

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద రైతు శిక్షణ కేంద్రం,కళ్యాణ మండపాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫంక్షన్ హాల్ ప్రారంభించడంతో ప్రజలకు సౌకర్యార్థం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ పటేల్, మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, సీఈఓ సంగమేశ్వర్ గౌడ్,నాయకులు లోక్య నాయక్,ప్రజా పండరీ,శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.