నేరాల నియంత్రణ, కేసులా చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

మన న్యూస్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషను మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో, నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమని అన్నారు. జిల్లాలో ఇప్పటికే సీసీ కెమెరాలు సహాయంతో చాలా నేరాలను ఛేదించడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేసారు.అనంతరం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి అక్కడ నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,సమస్యాత్మక వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీఐ వినయ్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్ఐలు సుమన్,రాఘవయ్య,జీవన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు