

మన న్యూస్;- అందమైన ముగ్గుల హరివిల్లులతో వాకిళ్లు అందంగా మారతాయని, చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరితే జీవితాలు సుమసురంగా తయారవుతాయని అన్నారు.. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినిలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలుమాట్లాడుతూ.. దుమ్ము కొట్టుకుపోయిన వాకిళ్లు సైతం రంగురంగుల ముగ్గులతో ముస్తాబు చేస్తే చూడముచ్చటగా ఉంటాయని…. ఏ స్థితిలోని వారైనా కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు… గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రతిభకు పదును పెట్టి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే కొత్త కొత్త ఆలోచనలు ఆవిష్కృతమవుతాయని చెప్పుకొచ్చారు.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని పైకి రావాలని… దేనినైనా శోధించి సాధిస్తే ఆ సంతృప్తి వేరుగా ఉంటుందని అన్నారు.. అబ్దుల్ కలాం అన్నట్లు గొప్ప గొప్ప కలలుకని వాటిని సాకారం చేసుకున్న నాడు జాతి గర్వించే బిడ్డలుగా తీర్చిదిద్దబడతామని చెప్పుకొచ్చారు .. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జీ మణి మృదుల వివిధ గ్రంథపాలకులు మధు బాబు నాగన్న వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రసన్న, సరోజినీ, రవి,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు