

దాత రావూరి రాంబాబుని సన్మానించిన ఆంధ్రా భద్రాచద్రి కమిటీ సభ్యులు
MANA NEWS ;- ప్రత్తిపాడు ,మన న్యూస్ :-పత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్ర గిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదా దేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకి అయ్యే మొత్తం ఖర్చు 150000 రూపాయలను ప్రత్తిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు,పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియచేసారు.ఈ సందర్బంగా వారిని ప్రముఖ పురోహితులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ వృత్తి రీత్యా గాజువాకలో ఉంటున్నామని,తమ స్వగ్రామం ప్రత్తిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్రా భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అన్నారు.అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి,రెడ్నం రాజా,పత్రి రమణ,మదినే నూకరాజు,నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.