

MANA NEWS ;- ఏలేశ్వరం,మన న్యూస్ :-కార్తీక వన సమారాధన ద్వారా ప్రజల్లో మరింతగా ఐకమత్యం ఏర్పడుతుందని పట్టణం తెలుగుదేశం అధ్యక్షుడు, 14వ వార్డు కౌన్సిలర్, ఎం ఎన్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూదీ నారాయణస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక కప్పల వారి చెరువు వద్ద జగనన్న కాలనీలో శ్రీ విజ్ఞేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలొ మూది నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సాంస్కృతి సాంప్రదాయాల కు ప్రత్యేకంగా కార్తీక వన సమారాధనలు నిలుస్తాయన్నారు. ఈ వన సమారాధనలో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కులమత బేధాలు లేకుండా మరింతగా ఐక్యత ఏర్పడుతుందన్నారు. ఈ వనసమరాదన లో సుమారు 5000 మంది అన్న ప్రసాదాలను స్వీకరించినట్లు ఆ సంఘ సభ్యులు తెలిపారు.