

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ పీవీ కృష్ణారావు పిలుపు
MANA NEWS ;- తిరుపతి ,మన న్యూస్ :-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో విద్యార్థి దశ నుంచి పర్యావరణ పరిరక్షణపై కనీస అవగాహన కలిగి ఉండాలని భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ పీవీ కృష్ణారావు పిలుపునిచ్చారు. స్థానిక పెరుమాళ్ళ పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం తిరుపతి మానవతా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. మానవతా చైర్మన్ ఎన్ భార్గవ, అధ్యక్షులు ఎం.వి. రమణ, హెడ్మాస్టర్ వి నాగమణి మాట్లాడుతూ బాల్య దశ నుంచి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిత్యజీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించే దిశగా పెద్దలకు అవగాహన కల్పించి నడుచుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భూ సంరక్షణ నిమిత్తం, భూగర్భ జలాల పెంపు కోసం మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వీరితోపాటు ఉపాధ్యాయులు సాంబశివారెడ్డి, సిద్దయ్య, అపరాజిత,చిట్టెమ్మ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.