

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02
ప్రపంచ కార్మికుల దినోత్సవం 139 వ మేడేని పురస్కరించుకొని ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (AICCTU) నాయకులు చిలమకూరి నారాయణ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్ సర్కిల్ నందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నూతన జెండాను పార్టీ సీనియర్ నాయకులు కే జకరయ్య గారు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లేబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్ రాజు, జకరయ్యలు మాట్లాడుతూ, 1886 సంవత్సరానికి ముందు ఆనాటి పారిశ్రామికవేత్తలు, పాలన వర్గాలు అవలంబిస్తున్న బానిస విధానాలకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం కోసం మరియు కార్మికుల హక్కుల కోసం పారిస్ నగరంలో జరిగిన వీరోచిత పోరాటంలో అసువులు బాసిన కార్మికుల రక్తం నుండి ఏర్పడినదే ఈ ఎర్రజెండా అని వారు గుర్తు చేశారు. కానీ నేడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కుదించి మళ్లీ కార్పొరేట్ల కార్ఖానాల్లో కార్మికులను బానిసలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నదని, ఈనాడు కార్మికులు తమ హక్కుల కోసం ఓ పోరాటం హక్కుల సాధన కోసం మరో పోరాటం చేయాల్సిన దుస్థితి ఉన్నదని, మరోవైపు కార్మికులను కులం పేరుతో మతం పేరుతో ఐక్యం కాకుండా విడదీసే ప్రయత్నాలు పాలకవర్గాలు చేస్తున్నాయని వీటన్నిటిని గుర్తించుకొని ఎప్పటికప్పుడు ఈ కుటిల రాజకీయాలకు బలికాకుండా మన భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం మన హక్కుల సాధన కోసం కార్మిక వర్గాలు ఐక్య ఉద్యమాలకు రాజులేని పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు కదిరయ్య, రామరాజు, కె బాబు, రేనాటి శ్రీనివాసులు, సంజీవ రాయుడు,చెన్నయ్య, కార్మిక సంఘ నాయకులు నారాయణ, గుర్రప్ప, గోపి, మున్నా, చంద్రయ్య, దేవానందం, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.