

- వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సిహెచ్సిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు…
ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : మానవ దృక్పథంతో వేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వేసవికాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు,రోగులు డీహైడ్రేషన్ కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మద్దాల అంజి,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.