

- రౌతులపూడిలో ముద్రగడ పర్యటన
- సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ముద్రగడ గిరిబాబు
రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి లో వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించారు. రౌతులపూడి మండలం రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ సోమరౌతు చిట్టిరాజా (జగ్గప్ప దొర) భార్య పెద్ద వెంకయ్యమ్మ (96) మంగళవారం మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వైసిపి కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. ప్రస్తుతం చిట్టీరాజా కోడలు వెంకట వరలక్ష్మి నరసయమ్మ సర్పంచ్ గా, కుమారుడు తిరుముల వెంకన్న దొర వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గిరిబాబు పెద్ద వెంకయమ్మ భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజవరం గ్రామానికి చిట్టిరాజా కుటుంబ సభ్యులు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయుకులు వాసిరెడ్డి భాస్కర్ బాబు, చింతకాయల సత్యనారాయణ, రాపర్తి రామకృష్ణ, సైపురెడ్డి వెంకటరమణ, కోరుప్రోలు దేముడు తదితరులు పాల్గొన్నారు.