

మన న్యూస్: శేరిలింగంపల్లి కాపు కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు అన్నారు.ఆదివారం పటాన్ చెరువులో మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు.ఈ వన మహోత్సవంలో ఇస్నాపూర్ నుండి చందానగర్ వరకు ఉన్న కాపు తెగలు బలిజ, ఒంటరి, మున్నూరు కాపులు సుమారు 5000 మంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాపు కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని,కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ వనమహోత్సవానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి,అంజి రెడ్డి,నందీశ్వర్ గౌడ్ డాక్టర్ పుంజాల అలేఖ్య చైర్మన్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ పర్సా పరమేశ్వరరావు తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య, డాక్టర్ పుంజాల వినయ్,శంభుపూర్ కృష్ణ,కార్పొరేటర్ కుత్బుల్లాపూర్ నల్ల అజయ్,నల్ల విష్ణు,నల్ల పవన్,నర్రా బిక్షపతి,గాలి అనిల్ కుమార్, సినీ ఆర్టిస్టులు కలగొల్ల రామానాయుడు,చరణ్ రాజు.శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షులు విష్ణుమూర్తి, అప్పారావు, సూర్యచంద్రరావు, పూల కిషోర్, త్రినాధ రావు,పాల్గొన్నారు.