మన న్యూస్ : శేరిలింగంపల్లి మాదాపూర్ శిల్పారామంలో ,శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి,శిల్పారామం సంయుక్త నిర్వహణలో శ్రీ భరతముని జయంతోత్సవం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాన్ని పసుమర్తి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గజవదాన బేడువే పురందరదాసు కీర్తనను డాక్టర్ వెంపటి చిన సత్యం శిష్య బృందం ప్రదర్శించారు. అనంతరం చావాలి బాల త్రిపురసుందరి శిష్య బృందం బృందావన నిలయేహ్, సీత ప్రసాద్ శిష్య బృందం మామవతు శ్రీ సరస్వతి, తిల్లాన లను దేబస్రి పట్నాయక్ శిష్య బృందం ఒడిసి నృత్యంలో స్థాయి మంగళాచరణ్, బిజినా సురేందర్ శిష్య బృందం మొహినియాట్టం నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్బంగా నృత్యాలను ప్రదర్శించిన కళాకారులను డాక్టర్ పసుమర్తి వెంకటేశ్వరా శర్మ , డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతి ముఖ్య అతిధులుగా హాజరై కూచిపూడి విశిష్టత , కూచిపూడి నాట్యానికి సేవ చేసిన వారందరిని స్మరించుకున్నారు.అదేవిగంగా కళాకారులందరిని ఘనంగా సత్కరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *