కోవూరులో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,కోవూరు:తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు.అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు.రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన.భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా కోవూరు లోని చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేకు కట్ చేసి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ…………….అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్న నిత్య శ్రామికుడు ,పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు అని తెలిపారు.
చంద్రబాబు నాయుడు నేటి తరాలు గురించే కాకుండా భవిష్యత్తు తరాలు గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.గతములో ముందు చూపుతో అయన తీసుకున్న నిర్ణయాల వలన వస్తున్న సంపద తోటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అని అన్నారు.ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం నుండి కూడా దేశ,విదేశాల్లో సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేసే వారు ఉన్నారంటే, దానికి కారణం చంద్రబాబు నాడు ఎన్ని విమర్శలు వచ్చినా, లెక్క చేయకుండా ఐటి రంగాన్ని అభివృద్ధి చేయడమే అని తెలియజేశారు.రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన అని తెలిపారు.
ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోనే మొదటి సరిగా రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చారు అని తెలియజేశారు.అది ఆరోజు తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం చేసినప్పటికీ,ఆ తర్వాత దేశమంతా ఆ సంస్కరణలు అమలు చేశారు.నేడు విద్యుత్ రంగం ఈ విధంగా ఉందంటే దానికి నాడు చంద్రబాబు తెచ్చిన సంస్కరణలె కారణం అని అన్నారు.ఈ విధంగా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టిన అనేక కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి అని తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఆయనకు కోవూరు ప్రజల తరుపున,పార్టీ నాయకులు,కార్యకర్తల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ,వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి భగవంతుడు అయు,ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంతంగి రాము, ఇంటూరి విజయ్ కుమార్,ఇందుపూరు మురళీ కృష్ణ రెడ్డి,బుదవరపు శివకుమార్, కుక్కంటి గోపాల్,గొర్రిపాటి నరసింహ,సజ్జా అశోక్,అజిగంటి రమణయ్య,తిరువాయిపాటీ వేణుగోపాల్,సోనగిరి సుబ్బరామయ్య, నిమ్మకాయల రమేష్, చల్లా సూర్య, చల్లా మురళీ, గేమిడి శివకుమార్,బొడ్డు శ్రీను,తాళ్ళపాక లక్ష్మయ్య,పుల్లూరు మదన్,కాకి భగవాన్,పడవల శ్రీనివాసులు,ఉక్కెం మల్లికార్జున,గుంజి శ్రీహరి,గోనెల శ్రీహరి,గోనెల శ్రీనివాసులు, షేక్. మాబాష, వేమయ్య,పూల యశ్వంత్ మన్నెపల్లి పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///