

మనన్యూస్,సర్వేపల్లి:అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు.రాష్ట్రాభివృద్ధి కోసం నూతనోత్సాహంతో ముందుకు.
సీబీఎన్ 35 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి నుంచే ఆయనతో నడుస్తున్నా.
*ప్రజలందరి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెంలో గిరిజనుల మధ్య సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….
ముఖ్యమంత్రి పుట్టినరోజు సంబరాల్లో ఆనందంగా భాగస్వాములైన గిరిజన బిడ్డలు అని అన్నారు.
గిరిజన మహిళలకు చీరలు, చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులతో పాటు మిఠాయిలు అందజేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.మా నాయకుడు చంద్రబాబు నాయుడి పుట్టినరోజు వేడుకలను గిరిజన బిడ్డల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.చంద్రబాబు నాయుడు 35 ఏళ్ల వయస్సులో ఉన్నపటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నా అని తెలియజేశారు.నా రాజకీయ జీవితం ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ, ఒకే నాయకత్వంలో కొనసాగుతున్నందుకు గర్వపడుతున్నా అని తెలియజేశారు.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం కూడా నాకు లభించిందని గొప్పగా చెప్పుకునేందుకు సంతోషిస్తున్నా అని అన్నారు.అభివృద్ధి కోసం నిరంతరం తపించే చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే హైటెక్ సిటీ, అమరావతి రాజధాని, త్వరలో పూర్తికావస్తున్న పోలవరం ప్రాజెక్టు..ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి అని తెలిపారు.
నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టిన వివిధ సంస్కరణలు, కీలక నిర్ణయాల కారణంగా ఈ రోజు లక్షల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు అని తెలియజేశారు.అభివృద్ధికే కాదు…సంక్షేమానికి కూడా ఆయన మారుపేరు. ఈ రోజు సామాజిక పింఛన్ లబ్ధిదారులు అందుకుంటున్న రూ.4 వేలలో రూ.2840 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే అని అన్నారు.గత ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేసిన అనేక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నారు అని తెలియజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్లను పునరుద్ధరించి ఆయా వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు అని అన్నారు.
నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ సహకారం, సమన్వయంతో ఏపీని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దే కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు అని తెలియజేశారు.
ప్రజలందరి ఆశీస్సులు చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు.