

మనన్యూస్,తవణంపల్లె:పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్” హాజరయ్యారు. తవణంపల్లె మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజల సమక్షంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ 75 కేజీల భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకుని సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మురళీమోహన్ పాల్గోని అన్నదాన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. “నారా చంద్రబాబు నాయుడు శ్రమ, నిబద్ధత, దూరదృష్టి కలిగిన నాయకుడని, ఆయన కృషితోన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు కల్పించడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది,” అని పేర్కొన్నారు. “చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని వేడుకలుగా కాకుండా సేవా దృక్పథంతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మధు కుమార్ యాదవ్, క్లస్టర్ ఇంఛార్జ్ సునీల్ చౌదరి, కొండ్రాజుకాలువ సర్పంచ్ పరంధామ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.