

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకలు ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడ ఉన్న స్థానిక నేతలకు పార్టీ అభిమానులకు పంచిపెట్టారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని అలాంటి మహోన్నత వ్యక్తి మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు సింగంశెట్టి సుబ్బరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుమల కొండ కేశవులు, సురేష్ కుమార్ తిరుత్తని వేణుగోపాల్ నాయనారు జగదీష్, సూర్య ప్రకాష్,సురేందర్ రాజు 34వ డివిజన్ ప్రజలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.