

సాలూరు నవంబర్16( మన న్యూస్ ):=
వివరాల్లోకి వెళితే పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలో రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ సమీపంలో నల్ల శంకర్రావు (45) భావన నిర్మాణ కార్మికుడు పట్టణంలో మండాది మాధవరావు కు చెందిన పాత గోడను కూలుస్తుండగా తనపై గోడ పడటంతో అక్కడకక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శంకర్రావు మరియమ్మ భార్యతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కొడుకు ప్రసాద్, పదవ తరగతి చదువుతున్న మరొక కొడుకు సందీప్ లు ఉన్నారు. ఆరు నెలలు క్రితమే శంకర్రావు తల్లి చిన్నమ్మ అనారోగ్యంతో మృత్య వాత పడింది. దీంతో వేరొకరి ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరియమ్మ ఊర్లోనే నూడిల్స్ అమ్మే ఓ షాపులో కూలి పని చేస్తుండగా శంకర్రావు నిత్యము ఏదో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంతలోనే ఇలా ఆ ఇంటి పెద్దదిక్కు గోడకూలి మృతు చెందాడన్న వార్త తెలియగానే ఆపస్మారిక స్థితికి వెళ్లిపోయింది. ఇరుగు పొరుగు వారు వచ్చి సంపర్యాలు చేయటంతో కోలుకుంది. గోడ పెళ్ళాలు కింద తన తండ్రిని చూసి పెద్ద కొడుకు ప్రసాద్ ఏడుస్తూ రా నాన్న ఇంటికి వెళదాం..మా నాన్నను బయటికి తీసి నాతో పంపరా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరును చూసి అక్కడ ఉన్న వారందరికీ కంటి నుంచి నీరు ఆగలేదు. ఆ కుర్రవాడిని ఓదార్చట్టము ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని పంచినామ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పట్టణ సిఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.