మనన్యూస్,కావలి:సమస్య మీది – పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలి 8వ వార్డులో బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన.గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.పలు సంస్థలను స్పాట్ లోనే పరిష్కారం చూపి, కొన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.స్థానిక వివేకానంద పార్కులో వ్యాయామ పరికరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.
పార్కుల అభివృద్ధిలో దాతలు సహకరించి ముందుకు రావాలని పిలుపు.32 పార్కుల సుందరీకరణలో బాగస్వామ్యులైన దాతల పేర్లని పార్కుల్లో పెడుతామన్న ఎమ్మెల్యే.
షాధి మందిల్ రోడ్డు వద్ద, స్పందన హాల్ వద్ద టీడీపీ జెండాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.రైతు బజార్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడి.ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ……….కావలిని కాపు కాస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం మా బాధ్యత, ఎలాంటి సమస్యలకైనా అక్కడే పరిష్కారం చూపుతూ ముందుకు వెళ్తున్నాం అని తెలియజేశారు.కావలిలో పేద, మధ్యతరగతి ప్రజల జోలికి ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు.
కావలి నియోజకవర్గం లో ఇల్లు కట్టుకునే పేదవారు ట్రాక్టర్లలో మట్టి తోలుకుంటున్నారు అని తెలిపారు.గత ప్రభుత్వంలో మాదిరిగా టిప్పర్లలో బయట ప్రాంతాలకు మట్టి తీసుకెళ్లి అమ్ముకోవడం లేదు అని అన్నారు.
అభివృద్ధి చేసే వారికి అన్ని కార్యక్రమాలు మంచిగానే కనిపిస్తాయి అని అన్నారు.
దొంగ పనులు చేసే వారికి అన్ని దొంగ పనులు లాగే కనిపిస్తాయి అని తెలిపారు.
కావలి అభివృద్ధి నా ప్రధాన అజెండా, కావలిలో రామ రాజ్యాన్ని నడిపిస్తాం అని తెలియజేశారు.
వ్యాపారస్తులు స్వేచ్ఛగా వారి వ్యాపారాలు చేసుకునేలా సహకరిస్తున్నాం అని అన్నారు.
గత ప్రభుత్వంలో మాదిరిగా బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం లేదు అని అన్నారు.వీలైతే అభివృద్ధిలో సహకరించాలి… అంతేకానీ నోటికొచ్చింది మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed