అభివృద్ధే అజెండాగా చంద్రబాబు పాలన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ధాన్యం అమ్మిన 24 గంటలలో అన్నదాతల అకౌంట్లలో డబ్బులు వేశాం.13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం.ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా
నిధులు వెచ్చించామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె కోవూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆమె 25 లక్షల వ్యయంతో నిర్మించిన కైలాసభూమి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. కోనేటి కయ్యలు ప్రాంతంలో 8,9 వార్డులలో పర్యటించిన ఆమె ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…..కోనేటి కయ్యల ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఆయుర్వేద ఆసుపత్రి పునర్నిర్మిచేందుకు కృషి చేస్తానన్నారు. తుప్పు పట్టి వున్న ఇనుప ఎలక్ట్రికల్ స్తంభాల స్థానంలో కొత్తగా సిమెంట్ స్తంభాలు వేయిస్తానన్నారు. 13 సంవత్సరాలుగా అపరిష్కృతంగా వున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కోవూరు నియోజకవర్గ రైతులు సహకార కేంద్రాల ద్వారా అత్యధిక ధాన్యం విక్రయించి రికార్డు సృష్టించారన్నారు. గతమెన్నడూ లేని విధంగా ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో అన్నదాతల అకౌంట్లో డబ్భులు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతన్నలు సంతోషంగా వున్నారన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాక బడి ఈడు పిల్లలున్న ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం పధకం ద్వారా డబ్బులు జమ చేస్తామన్నారు. వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు 20 వేల ఆర్ధిక సహాయం ప్రకటించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు పంచాయతి రాజ్ ఎఇ శ్రీనివాసులు, తహసీల్దార్ నిర్మలానంద బాబా పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఎంపిపి పార్వతి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, స్థానిక నాయకులు గాదిరాజు అశోక్, బాల రవి, పిచ్చుక మధు, తిరుమూరు అశోక్ రెడ్డి, నల్లపరెడ్డి సురేష్ రెడ్డి, జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…