

తిరుపతి, నవంబర్ 15, మన న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కరాటే చంద్ర ని తెలుగు తమ్ముళ్లు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయానికి కృషి చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులను ఇచ్చారు. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన టిడిపి నాయకులు కరాటి చంద్ర ను రాష్ట్ర రజకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. ఈ మేరకు శుక్రవారం నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నైనర్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో కరాటి చంద్ర ని ఘనంగా సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఎస్వీఎం శ్రీధర్, రూపేష్ ప్రకాష్ దాము నారాయణ శరత్ సన్మానించిన వారిలో ఉన్నారు.