

ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) నవంబర్ 15
రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఏలేశ్వరం నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మూదీ నారాయణస్వామిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ తనకు తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు రుణపడి ఉంటానని,ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.కష్టపడి పని చేసే కార్యకర్తలకి,నాయకులకి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు, సత్కారం లభిస్తుందని ఈ పదవిని ఇవ్వడం ద్వారా బహిర్గతం అయిందని,తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన డైరెక్టర్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు.