

మనన్యూస్,తిరుపతి:శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు నిరంతరం సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఆ కార్యవర్గం వెల్లడించింది. ఆదివారం ఉదయం స్థానిక రుద్రరాజు సంపూర్ణమ్మ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి కృష్ణమూర్తి ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తదితరులు మాట్లాడుతూ వినాయక సాగర్ ప్రాంగణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కమిషనర్ మోర్య ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఎంపీ గురుమూర్తి తదితరులను కలిసి వినాయక సాగర్ అభివృద్ధికి సహకరించాలని కోరనున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ ఆడిట్ ను పూర్తిచేసి రెన్యువల్ చేసి బైలాలో మార్పులు చేర్పులను సవరించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు నిరంజన్ నాయుడు, వెంకటేశ్వర్లు రాజు, కామేశ్వరరావు,చంద్రశేఖర రావు, రామచంద్రరాజు, రిటైర్డ్ ఎస్సై రమణ, బసవయ్య, శంకర్ రాజు, వి ఆర్ వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
