

మన న్యూస్,బుచ్చిరెడ్డిపాలెం, ఏప్రిల్:12 నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో జొన్నవాడ ఆర్చి ఎదురు వీధిలో శనివారం ఉదయం రాయల సూపర్ మార్కెట్ 2.0 ప్రారంభించారు.సూపర్ మార్కెట్ అధినేతలు కె.సురేష్ బాబా, తన్నీరుసుధాకర్,గాదంశెట్టిసత్యనారాయణ,వెంకట నాగేశ్వరావు సూపర్ మార్కెట్ను ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.అనంతరం కె. సురేష్ బాబా మాట్లాడుతూ….. బుచ్చిరెడ్డిపాలెం లో రెండో బ్రాంచి ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.అందరికీ నాణ్యమైన సరుకులను సరసమైన ధరలకు అందించడమే ధ్యేయంగా పని చేయడం జరుగుతుంది అని అన్నారు.తమను ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2000 కొనుగోలు చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు అని అన్నారు.అనంతరం బాలు మాట్లాడుతూ……….. ఏడు సంవత్సరాల క్రితం బుచ్చిరెడ్డిపాలెం లో మొదటి బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రజలు ఆన్ లైన్ సర్వీసులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సూపర్ మార్కెట్ను ప్రోత్సహిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు. బుచ్చి ప్రజలు తమ రాయల్ సూపర్ మార్కెట్ 2.0 ను ఆదరించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాచూరి సత్యనారాయణ,దుగ్గిశెట్టి హరినాథ్, సుమంత్,దర్శి బాల నరసింహ,అడ్వకేట్ నరసింహారావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
