
మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 11: పల్నాడు జరిగిన సంఘటనలో సాక్షి ఎడిటర్ ఇతర విలేకరులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం నెల్లూరు గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జర్నలిస్ట్ నాయకులు ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై వేధింపులు కేసులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించినంత మాత్రాన పోలీస్ కేసులు పెట్టడం తగదని వారన్నారు. వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పత్రికలను విలేకరులను అక్రమ కేసుల ద్వారా వేధించడం తగదన్నారు. అక్రమ కేసుల్ని తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్. ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కార్యదర్శి మస్తాన్ రెడ్డి కోశాధికారి హనోక్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమేష్ బాబు,కార్యవర్గ సభ్యులు గుణ్ణం ప్రతాప్ సామ్నా అధ్యక్షుడు సుబ్బారావు,ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, కోశాధికరీ సునీల్ గవాస్కర్, సహాయ కార్యదర్శిలు ఎనోష్,జాషువా తదితరులు పాల్గొన్నారు.
