

మన నూస్, కావలి, ఏప్రిల్ 11:*మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిసామాజిక ఉద్యమాలకు మార్గదర్శి,బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి,మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి టిడిపి కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు జరిగాయి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో పార్టీ నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ…….మహాత్మా జ్యోతిరావుపూలే నవతరానికి ఆదర్శప్రాయుడని సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన,స్త్రీ,పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే అట్టడుగువర్గాల ఆత్మగౌరవ పోరాటానికి విద్యనే ఆయుధంగా అందించిన పూలే మహాశయుని ఆశయసాధనకి కృషి చేయడం మనందరి బాధ్యత అని కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావ్ పూలే అభిమానులు పాల్గొన్నారు.
