{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

మన న్యూస్: కడప జిల్లా: ఏప్రిల్ 10: కడప నగరం ఆవాజ్ కార్యాలయం నందు ఆవాజ్ కమిటీ జిల్లా విస్తృత సమావేశం పి చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ,అబ్దుల్ సుభాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం తనకున్న మందబలంతో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలను తుంగలో తొక్కి భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిన ప్రజల మధ్య మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను హరిస్తుందని,వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లిం మైనార్టీ సమాజానికి మేలు జరుగుతుందని, కాపాడబడుతాయని ముస్లింల అభివృద్ధి జరుగుతుందని బిజెపి ప్రభుత్వం చెప్పడం ఆ సామాజిక తరగతిని మోసగించడమే అని అన్నారు.నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను చేయడమే తప్ప మెరుగుపరిచింది ఎక్కడ అని ప్రశ్నించారు. అలాల్ పేరుతో హిజాత్ పేరుతో అజాం పేరుతో ఆహారం పేరుతో త్రిపుల్ తలా పేరుతో ఇతర అనేక రూపాలలో ముస్లిం మైనార్టీలపై భౌతిక దాడులు చేయడం.సామూహిక హత్యలు చేయడం మానవ కనడాన్ని సృష్టించడమే పనిగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్టుకున్నది. వక్ఫ్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఉంటే సరిచేసి వారికి స్వాధీనపరిచి ప్రజాతంత్ర పద్ధతిలో బోర్డును నిర్వహించవలసిన వారు రాజకీయ పార్టీల వేదికల వక్ఫ్ బోర్డు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహారం తలనొస్తుందని వైద్యం కోసం పోతే తల తీసేయండి అని అన్నాడంట అలా ఉంది అన్నారు. బిజెపి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని. భారతదేశాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని చిర చరాస్తులు ఐక్యతను లౌకిక విధానాలను ప్రేమించి గౌరవించే భరతమాత సేవ చేసే బిడ్డలందరును ఐక్యపరిచి నల్ల చట్టాలు వ్యతిరేకంగా పోరాటాలకై ప్రయత్నిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్,అన్వర్ భాష ,ఎస్,అబ్దుల్ సత్తార్,ఎస్,షరీఫ్,ఎస్,ఖాదర్ బాషా, ఎస్ మెహబూబ్ భాష ,ఆవాజ్ జిల్లా మహిళా నాయకులు గౌసియా, జమీల,బిబి,ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు భాష వల్లి,జహంగీర్,జాఫర్, అబ్దుల్ రెహమాన్,సాహిబ్ ,ఖలీల్, తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *